తొలివలపు సినిమా ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు గోపీచంద్. ఆ సినిమా ఫలితం కలిసి రాకపోవడంతో ఆ తర్వాత జయం, వర్షం, నిజం వంటి సినిమాలలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తరువాత హీరోగా మాత్రం యజ్ఞం సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత లక్ష్యం, రణం గోలీమార్, లౌక్యం ,సాహసం వంటి సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక గోపీచంద్ ఎవరో కాదు అలనాటి డైరెక్టర్ టి కృష్ణ తనయుడు.


గోపీచంద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ 21 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం జరిగింది.. ఆ పోస్టులో గోపీచంద్ నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ 21 ఏళ్లు పూర్తి అవుతోంది ఈ సినీ ప్రయాణంలో నాకు వచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఇక తను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీ అందరి ప్రేమే అని తెలిపారు. తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ గోపీచంద్ ట్వీట్ చేయడం జరిగింది. దీంతో గోపీచంద్ అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు అయితే మాత్రం ప్రభాస్ తో కలిసి మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారని కోరుతున్నారు.


అయితే ప్రస్తుతం గోపీచంద్రుని మాత్రం వరుస ప్లాపులు వెంటాడుతూ ఉన్నాయి దీంతో అటు అభిమానులలో చాలా నిరాశ ఎదురవుతోంది. చివరిగా లౌక్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఇక ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఏ సినిమా కూడా ఆడలేదు మధ్యలో గౌతమ్ నంద సినిమా యావరేజ్ గా నిలిచిన అది కూడా గోపీచంద్ స్టామినాను అందుకోలేకపోయింది. తాజాగా పక్క కమర్షియల్ చిత్రంతో మంచి విజయాన్ని కొట్టాలని వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ప్రస్తుతం శ్రీ వాసు డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు గోపీచంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: