ఇక వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్ టాలీవుడ్ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేసిన 'సీతా రామమ్' ఫిల్మ్ ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్నది.ఇది కేవలం క్లాసికల్ ఫిల్మ్ మాత్రమే కాదు మంచి ఎపిక్ లవ్ స్టోరి అని కూడా సినీ లవర్స్ మూవీపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా దుల్కర్ సల్మాన్ ఇంకా మృణాళ్ ఠాకూర్ నటించారు. కీలక పాత్రలను సుమంత్ ఇంకా రష్మిక మందన పోషించారు. ఇక ఈ పిక్చర్ చూసిన ప్రతీ ఒక్కరు కూడా లవ్ స్టోరికి బాగా కనెక్ట్ అవుతున్నారు.అందువల్ల ఈ సినిమాను థియేటర్లలో జనాలు బాగా చూస్తున్నారు.టాకీసులకు సినిమాలు చూసేందుకు ఇక ప్రజలు రావనే భ్రమను కూడా ఈ సినిమా తొలగిస్తున్నదని సినీ పరిశ్రమకు చెందిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. 


ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే జనాలు థియేటర్లకు హ్యాపీ గా వచ్చి ఈ పిక్చర్ చూస్తున్నారు.తొలి రోజున ఈ సినిమాకు ఏకంగా రూ.కోటిన్నర కలెక్షన్ వచ్చింది. రెండో రోజు రూ.2 కోట్లు, మూడో రోజు 2.62 కోట్లు ఇలా.. రోజురోజుకూ కూడా కలెక్షన్స్ బాగా పెరిగాయి. ఇక ఏడో రోజు కూడా ఈ సినిమాకు రూ.65లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు రూ.కోటికిపైగా లాభం వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.ఇంకా ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా బాగా రాణిస్తుంది.సినీ ప్రియులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రంగా 'సీతా రామమ్' సినిమా నిలిచింది. 'బింబిసార' సినిమాతో పాటుగా ఈ చిత్రాన్ని కూడా జనాలు చాలా విశేషంగా ఆదరిస్తున్నారని ఈ మూవీ మేకర్స్ పేర్కొంటున్నారు.ఇక ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ కూడా తెలుగులో మంచి క్రేజ్ ఇంకా అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: