ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై  మకుటం లేని మహారాణిగా కొనసాగుతుంది యాంకర్ సుమ. దశబ్ద కాలం నుంచి టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఎంతోమంది మెయిల్ యాంకర్స్ ఉన్న.. ఇక కొత్తగా చాలామంది ఫిమేల్ యాంకర్స్ పుట్టుకొచ్చిన కూడా యాంకర్ సుమాకి ఎవరూ పోటీ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుమ కేరళకు చెందినది అయినప్పటికీ తెలుగులో గలగల మాట్లాడేస్తూ తన స్పాంటేనియస్ పంచులతో బుల్లితెర ప్రేక్షకులందరినీ కూడా  కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది.


 కేవలం బుల్లితెరపై కార్యక్రమాలు మాత్రమే కాదు అటు సినిమా ఈవెంట్లతో కూడా బిజీబిజీగా ఉంటుంది. స్టార్ హీరో సినిమా ఏదైనా విడుదలవుతుందంటే చాలు ఇక ప్రతి ఫంక్షన్లో కూడా యాంకర్ గా సుమా ప్రత్యక్షమవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం సుమా వ్యాఖ్యాతగా ఈటీవీలో క్యాష్ అనే కార్యక్రమం వస్తుంది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం ఎంతో టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది అని చెప్పాలి. ప్రతివారం నలుగురు స్పెషల్ గెస్ట్ లను పిలిచి ఇక వారితో ఫన్నీ టాస్కులు ఆడిస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది.


 ఇకపోతే ఇటీవల క్యాష్ కార్యక్రమానికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ప్రోమోలో చూసుకుంటే ఒక కాలేజీ కుర్రాడు ఏకంగా పువ్వు పట్టుకొని వచ్చి యాంకర్ సుమకి ఐ లవ్ యు చెబుతాడు. దీంతో వెంటనే స్పాంటినీయస్ గా స్పందించిన సుమ దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే ఈ వారం ఎపిసోడ్లో హరితేజ, ప్రభాస్ శ్రీను, హేమ, ప్రవీణ్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ క్రమంలోనే ఇక చివర్లో వారికి ఒక ఫన్నీ టాస్క్ ఇస్తుంది సుమా. దీంతో సుమాకి ప్రపోజ్ చేయమని ప్రవీణ్ కాలేజీ కుర్రాడికి చెబుతాడు. దీంతో ఒక పువ్వు పట్టుకొని వెళ్లి నిన్ను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. ఐ లవ్ యు సుమ అంటూ ఎంతో ఫీల్ తో చెబుతాడు సదరు కుర్రాడు. దీంతో వెంటనే స్పందించిన సుమా నువ్ మా అబ్బాయి క్లాస్మేట్ కదా అంటూ కౌంటర్ వేస్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: