సూపర్ స్టార్ బాబు తన యాక్టింగ్ తో అదరగొట్టేస్తే.. ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతః అనపించుకున్నారు.బాహుబలి లాంటి ఎపిక్ సిరీస్‌తో తెలుగు స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అయితే ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా జక్కన్న అవార్డు గెలుచుకున్నారు. ఇక మరోవైపు.. మహేశ్ బాబు కూడా తన అందంతో ఇంకా నటనతో రికార్డ్ లెవెల్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ వస్తోంది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా గురించే హాట్ టాపిక్ నడుస్తుంది. దీంతో సినిమాపై ఇప్పటికే ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లుక్స్ నుంచి బడ్జెట్ వరకు అన్నీ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.


సినిమాలో నటించినందుకు యాక్టర్లకు రెమ్యునరేషన్ ఇవ్వడం మనకు తెలిసిందే. కానీ కొంత మంది అలా కాకుండా వచ్చిన వసూళ్లలో వాటాల వైపు మొగ్గు చూపుతుంటారు. మహేష్ కూడా తన హిట్ అయిన సినిమాల్లో ఇలా వాటాలు అడుగుతారు.ఈ క్రమంలో మహేష్ బాబు ఇదే విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి, నిర్మాతని అడిగినట్లు సమాచారం. ఓటీటీ, వీఎఫ్ఎక్స్ సెటప్‌ల ద్వారా పెద్ద హాలీవుడ్ ఆధారిత ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆన్-బోర్డ్‌లోకి రావడానికి ఎంతగానో ఆసక్తి చూపించింది. ఎస్ఎస్ రాజమౌళి తన ప్రొడక్షన్ హౌస్ పేరును జత చేసి నిర్మాతగా కూడా ఉన్నారు. అతను సినిమాకి వచ్చే లాభంలో వాటాల ప్రతిపాదికన రెమ్యూనరేషన్ ని తీసుకుంటారు. అయితే ఈ చిత్రంలో హాలీవుడ్‌కు చెందిన ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండటంతో మహేశ్ బాబుకు అలాంటి డీల్ కుదరకపోవచ్చని సమాచారం.ఒకవేళ మహేష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయితే ఈ డీల్ కుదరవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: