
రజినీకాంత్ మాత్రం ఈసారి రెండు సినిమాలలో నటిస్తూ అదరగొట్టేస్తున్నారు ఒకటి డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో జైలర్ సినిమా తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమాతో పాటు తన కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో లాల్ సలాం అనే చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే తర్వాత రజనీకాంత్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ ఒక సినిమా చేయబోతున్నారంటూ కమలహాసన్ కన్ఫామ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది కమలహాసన్.
అయితే ఈ ప్రాజెక్టులో లోకేష్ కనుక రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించే సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి డైరెక్టర్ ఎవరు అనే విషయంపై త్వరలోనే క్లారిటీ రాబోతోందని తెలుస్తోంది. జైలర్ సినిమాని ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక కమలహాసన్ నటించిన ఇండియన్-2 సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ఇండియన్ -2 సినిమా కాస్త ఆలస్యం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కమలహాసన్ రజనీకాంత్ కలసి సినిమా నిర్మించడంతో అభిమానులు కాస్త ఆనందపడుతున్నారు.