మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడిగా నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగబాబు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి లో హీరో అవ్వాలని అనుకున్న ఆయన హీరోగా కొనసాగలేక నటుడిగా మిగిలాడు. కానీ నటుడుగా కూడా సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతగా మారాడు నాగబాబు. నిర్మాతగా మారినప్పటికీ కూడా ఆయనకి పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఏ రంగంలో కూడా సక్సెస్ కాలేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నాడట నాగబాబు. అయితే ఇటీవల కాలంలో ఆయన కన్నీ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. 

తాజాగా ఇప్పుడు మళ్లీ అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబు ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం సినిమాల ద్వారా గుర్తింపు రావడంలేదని ఆయన సినిమాలకు దూరం అవ్వాలని అనుకోవడం లేదుట తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ కోసం ఆయన సినిమాలకు దూరం అవ్వాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు ఏదో ఒక సినిమాలో ఏదో ఒక పాత్రలో మెరిసిన నాగబాబు ఇప్పుడు చిన్న పాత్రలో కూడా కనిపించడానికి సిద్ధంగా లేడు. కొత్త సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. అయితే దానికి ముఖ్య కారణం ప్రస్తుతం జనసేన పార్టీలో అత్యంత క్రియాశీలక నాయకుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే .

పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల నాగబాబుకు జనసేన పార్టీకి సంబంధించిన కీలక పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అందుకే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విస్తృతంగా ప్రచారం చేయడానికి తన పూర్తి సమయాన్ని రాజకీయాల కే పరిమితం చేయాలన్న ఉద్దేశంతో నాగబాబు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే సినిమాల ఆఫర్లు వస్తున్నప్పటికీ రిజెక్ట్ చేస్తున్నాడట నాగబాబు. అయితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటివరకు మాత్రమే సినిమాలకు దూరంగా ఉంటారా లేక పూర్తిగా సినిమాలకు దూరం అవుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలకి పరిమితం కావాలనుకున్న నేపథ్యంలో తన అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు సైతం నాగబాబు పాత్రను మిస్ అవుతాము అంటూ ఈ వార్త తెలిసిన వారందరూ కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: