టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్  పుత్రుడు గౌతమ్ ఘట్టమనేని  స్టార్ కిడ్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఇక అటు వారి కూతురు సితార కూడా అందరికీ సుపరిచితమే.రీసెంట్ గా సితారా ఇంటర్నేషనల్ బ్రాండ్ పీఎంజే జ్యూవెల్లరీకి అంబాసిడర్ గా మారి ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారారు. ఈ రోజు ఇండియాలో బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సితారాతోపాటు నమ్రతా  కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు రాబోతున్నారనే ప్రశ్న ఆమె ఎదురైంది. ఇక నమ్రతా మాట్లాడుతూ.. మా అబ్బాయి గౌతమ్ ప్రస్తుతం 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నారు. తను ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే గౌతమ్ ఇప్పుడు కేవలం తన స్టడీస్ పైనే ఫోకస్ పెట్టాడు. మున్ముందుకు గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆ తర్వాతే ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది.' అంటూ నమ్రత చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడప్పుడే గౌతమ్ తెరపై కనిపించే ఛాన్స్ లేదనే విషయం తేలిపోయింది.గౌతమ్ మంచి టాలెంటెడ్ బాయ్. అటు స్టడీస్ తో పాటు స్విమ్మింగ్ లో కూడా మంచి నైపుణ్యం సాధించారు.


గౌతమ్ ఇప్పటికే చాలా టైటిల్స్ గెలుచుకున్నారు. ఇంకా మరోవైపు థియేటర్ ఆర్ట్స్ పైనా కూడా శిక్షణ తీసుకుంటున్నారు. ఆ మధ్యలో ఓ ఇంగ్లీష్ నాటకంలో నటించి సోషల్ మీడియాని షేక్ చేశాడు. అసలు గుక్క తిప్పకుండా డైలాగ్స్ చెబుతూ ఎంతగానో ఆకట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక సితార కూడా యాక్టింగ్, డాన్స్ లో శిక్షణ పొందుతుంది.ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన  '1: నేనొక్కడే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ నటించిన విషయం తెలిసిందే. అదే అతనికి మొదటి చిత్రం.అయినా తన పెర్ఫామెన్స్ తో గౌతమ్ ఆకట్టుకున్నారు. ఇక నమ్రతా కూడా తన కెరీర్ ని వదులుకొని పూర్తిగా మహేష్ తమ పిల్లల విషయంలోనే చాలా శ్రద్ధ వహిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ ను బ్యూటీఫుల్ గా ఉండేలా ప్రతి అంశాలను కూడా ఆమె దగ్గరుండి నేర్పిస్తున్నారంట. ఇక తాజాగా నమ్రతా ఇచ్చిన అప్డేట్ ప్రకారం.. గౌతమ్ ఎంట్రీ మరో మూడునాలుగేళ్ల తర్వాతేనని స్పష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: