క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ప్రపంచ కప్ కు ప్రతి టీమ్ కూడా సిద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగబోతోంది. అయితే ఈసారి వరల్డ్ కప్ కు ఇండియా ఆదిత్యం ఇస్తోందని చెప్పవచ్చు.. దీంతో ప్రపంచ కప్ వీలైనంత ఎక్కువగా ప్రచారం కల్పించేందుకు ఇండియన్ క్రికెట్ బోర్డు సంస్థ పలు రకాలుగా ప్లాన్లు చేస్తోంది.. ఇందులో భాగంగానే గోల్డెన్ టికెట్ ను కూడా తీసుకువచ్చింది.. దేశంలోని ప్రముఖ సెలబ్రెటీలను ఈ గోల్డెన్ టికెట్ ను అందించడం జరుగుతోంది.ఈ టికెట్ పొందిన వారు వరల్డ్ కప్ మ్యాచ్లో విఐపి మర్యాదలతో చూడవచ్చు.


ఈ టికెట్ ని ముందుగా అందరి కంటే బిగ్ బి అమితాబచ్చన్ అందుకోవడం జరిగింది.. అమితాబ్ తర్వాత ఇండియన్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కు గోల్డెన్ టికెట్ అందుకున్నారు.. ఇప్పుడు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కు కూడా ఆ గౌరవం లభించినట్లు తెలుస్తోంది.రజినీకాంత్ స్వయంగా కలిసి గోల్డెన్ టికెట్ ని అందుకున్నట్లు bcci సెక్రటరీ జైషా ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. బాలీవుడ్ లో ఫుల్ క్రేజీ ఉన్న అమితాబ్  కు గోల్డెన్ టికెట్ ఇచ్చిన bcci తమిళ సినిమాలో దిగజ నటుడైన రజనీకాంత్ కి దీనిని అందజేశారు.


అయితే ఇప్పుడు అందరు చూపు తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. తెలుగులో ఏ హీరోకి ఈ స్టార్ గోల్డెన్ టికెట్ అందుకుంటారా అంటూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. దీని మీద సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తోందని తెలుస్తోంది. కొంతమంది మాత్రం చిరంజీవికి ఈ గౌరవం దక్కుతుందని అంటూ ఉండగా మరి కొంతమంది తమ హీరోలకు వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు ఇంకా bcci క్లారిటీ ఇవ్వలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: