ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా స్కంద అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ , ప్రిన్స్మూవీ లో కీలకమైన పాత్రల్లో నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాని నిన్న అనగా సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ టీజర్ , ట్రైలర్ , పాటలు ఈ మూవీ విడుదలకు ముందే ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ నిన్న విడుదల అయిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. మరి ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 3.23 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.22 కోట్లు , యుఏ లో 1.19 కోట్లు , ఈస్ట్ లో 59 లక్షలు , వెస్టు లో 41 లక్షలు , గుంటూరు లో 1.04 కోట్లు , కృష్ణ లో 45 లక్షలు , నెల్లూరు లో 49 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.62 కోట్ల షేర్ ... 13.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ram