
అలాగే తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ సినిమాగా కూడా ఆస్కార్ బరిలో నిలిచి ఆస్కార్ పురస్కారాన్ని నాటు నాటు పాటకి అందుకోవడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఆస్కార్ అనౌన్స్మెంట్ చేసిన ఎక్స్ట్రా బ్రాంచ్ జాబితాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చాలామంది ప్రముఖు నటుల పేర్లు వినిపిస్తూ ఉన్నది.. ఇందులో అనేకమంది హాలీవుడ్ నటులతో పాటు రామ్ చరణ్ కూడా ఉంటున్నట్లు సమాచారం. తమ సరి కొత్త సభ్యునిగా ఆహ్వానిస్తున్నట్లు ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు తెలియజేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ అద్భుతమైన సంఘటన మా యాక్టర్స్ బ్రాంచ్ లో ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది అంటూ వీరు తమ నటనతో అందరిని ఆకట్టుకున్నారు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలలో మాకు బహుమతిగా అందించారంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మరొకసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా ప్రైడ్ మూమెంట్ గా మారిపోయింది.. ఇంకా ఈ లిస్టులో రిసాన లించ్, లూయిస్ కుటిన్, చాంగ్ చైన్ కూడా ఉన్నారు. ఈ సినిమానే డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు.