హాయ్ నాన్న సినిమాతో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు నేచురల్ స్టార్ నాని.  ఇందులో క్రేజీ హీరోయిన్ మ్రోణాల ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ కియార కన్నా నానికి కూతురు పాత్రలో కనిపించబోతోంది. శౌర్యవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వైరా ఎంటర్టైన్మెంట్ పై రూపొందుతుంది. ఫ్యాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన అయితే ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీగా ఉన్నాడు నాని. విభిన్నంగా సినిమాను ప్రచారం చేస్తున్నాడు. 

ఈ నేపథ్యంలోనే తాజాగా తన అభిమానులతో కాసేపు సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేశాడు నాని. ఇందులో భాగంగానే తన అభిమానులు అడిగిన పలు రకాల ప్రశ్నలకు బదులు వచ్చాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని నానిని స్టార్ హీరోయిన్ మహానటి సేమ్ కీర్తి సురేష్ తో మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు అంటూ ప్రశ్నలు ఇచ్చాడు. ఆమెతో త్వరలోనే సినిమా చేయండి మేము ఎంతో ఆసక్తిగా చూస్తున్నాము. మీ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము అంటూ తెలిపాడు. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నేను లోకల్ దసరా సినిమాలు ఎంతైనా అలరించాయో మనందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.

కీర్తి సురేష్ ఈ సినిమాలో తన పర్ఫామెన్స్ తో మంచి మార్కులు నెట్టేసింది. నేపథ్యంలోనే మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఉంది అంటూ కోరుకుంటున్నారు అభిమానులు. ఇక అభిమాని అడిగిన ప్రశ్నకి గాను  ఇంట్రెస్టింగ్ గా బదులిచ్చారు. తాను రెడీగానే ఉన్నాని.. కీర్తి సురేష్ ఏమంటావంటూ ఆ పోస్ట్ ను ట్యాగ్ చేశారు. కీర్తి మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం కీర్తి సురేస్ తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంటోంది. ఇప్పటికే వరుణ్ ధావన్ 18వ చిత్రంలో నటిస్తుండగా.. 'అక్క' అనే వెబ్ సిరీస్ లోనూ రాధికా ఆప్టే తో కలిసి నటించనుంది. ఈ క్రమంలో మళ్లీ నాని - కిర్తీ సురేష్ ను అభిమానులు వెండితెరపై చూడాలంటే కాస్తా సమయం పట్టడం ఖాయం. ఏదేమైనప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ మాత్రం ఆన్ స్క్రీన్ పై చాలా బాగుంటుంది అని చెప్పాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: