అందుకే ఈ సిరీస్ కి కొనసాగింపు గా రెండవ సీజన్ చేద్దామని అనుకున్నారు కానీ, నాగ చైతన్య మాత్రం సినిమా చేద్దాం అని డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో అన్నాడట.అందుకే దూత సీక్వెల్ ని సినిమా వెర్షన్ కి రాసుకుంటున్నాడట విక్రమ్. వెబ్ సిరీస్ కంటే ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో స్టోరీ ని సిద్ధం చేసినట్టు టాక్. వచ్చే ఏడాది ప్రారంభం లోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట. వెబ్ సిరీస్ లో ఉన్న పాత్రలే సినిమాలో కూడా కనిపిస్తాయి కానీ, కొన్ని క్యారెక్టర్స్ మాత్రం సినిమాలో ఉండవు.
ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో కామెడీ లెజెండ్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన పాత్ర మరియు తరుణ్ భాస్కర్ పాత్ర కూడా సినిమా వెర్షన్ లో ఉంటుందని టాక్. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి అనే దర్శకుడితో 'తండేల్' అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.లవ్ స్టోరీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆమె నాగ చైతన్య తో కలిసి చేస్తున్న చిత్రమిది. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా నాగచైతన్య కెరీర్ లో మైల్ స్టోన్ లాగ నిలిచిపోతుందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి