ఈ విషయం గురించి కొందరు ఆమెను ప్రశ్నించ గా దానికి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడనట్లు భోగట్టా! 'నేను చెప్పడాని కి ఏమీ లేదు. ఇప్పుడు నేనేమీ మాట్లాడదల్చుకో లేదు. నాకు ప్రైవసీ కావాలి. దయచేసి మరింకేమీ అడగొద్దు' అని సున్నితంగా తిరస్కరించిదట! కాగా ఇషా కొప్పికర్‌కు హీరోయిన్ ప్రీతి జింటా వల్ల రెస్టారెంట్ యజమాని టిమ్మితో పరిచయం ఏర్పడింది. మూడేళ్ల పాటు స్నేహం చేసిన వీరు తమకు తెలియకుం డానే ఒకరి తో మరొకరు ప్రేమలో పడ్డారు.
ఇరు కుటుం బాలు వీరి ప్రేమకు పచ్చజెండా ఊపడం తో 2009 నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2014లో రియానా అనే కూతురు జన్మించింది. ఇషా సినిమాల విషయానికి వస్తే.. 2000వ సంవత్సరం లో వచ్చిన ఫిజా సినిమా తో బాలీవుడ్ లో తన ప్రయాణం మొదలు పెట్టింది ఇషా. కంపెనీ, కాంటె, పింజర్, డాన్.. తదితర చిత్రా ల్లో నటించింది. హిందీలోనే కాకుండా తమిళ, తెలుగు, కన్నడ, మరాఠి భాషల్లోనూ నటించింది. తెలుగు లో చంద్రలేఖలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ప్రేమతో రా, కేశవ చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన అయాలన్ అనే తమిళ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి