గత సంవత్సరం ఎలాంటి అంచనాలు లేకుండా అక్టోబర్ లో విడుదలైన బాలీవుడ్ చిన్న సినిమా ‘12త్ ఫెయిల్’ కు సంబంధించిన మరొక సంచలనం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 30 కోట్ల పెట్టుబడితో తీసిన ఈసినిమాకు 100 కోట్ల నెట్ కలక్షన్స్ రావడం గత సంవత్సరం బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం.లేటెస్ట్ గా ఐఎండిబి ప్రకటించిన 250 స్థానాలలో ఈసినిమాకు 50 స్థానం దక్కడంతో పాటు మరే భారతీయ సినిమాకు ఈ ర్యాంకింగ్స్ లో స్థానం దక్కకపోవడంతో ఈమూవీ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈవార్త విని ఈమూవీ దర్శకుడు విధు వినోద్ చోప్రా తాను ఇక చనిపోయినా ఫర్వాలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు అంటే ఆసినిమా పట్ల ఆదర్శకుడుకి ఎలాంటి నమ్మకం ఉందో అర్థం అవుతుంది.ఈసినిమాను విడుదల అవ్వక ముందు చూసి దర్శకుడు విధు వినోద్ చోప్రా భార్య ప్రముఖ క్రిటిక్ అనుపమా చోప్రా ఈమూవీ ఫస్ట్ కాపీని చూసి ఈసినిమాను ఎవరు చూడరని అందువల్ల ఓటీటీకి ఇచ్చేయమని చెప్పినప్పటికీ దర్శకుడు సాహసంతో ఆసినిమాను ధియేటర్లలో గత సంవత్సరం విడుదలచేసి ఘన విజయం సాధించాడు. ఇప్పుడు ఈసినిమాను డిస్ట్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న నేపధ్యంలో ఈమూవీకి వస్తున్న మిలియన్స్ కొద్ది వ్యూస్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.దీనితో సినిమా నచ్చితే చాలు దేశవ్యాప్తంగా ఏప్రాంతం వారైనా చిన్నపెద్ద అన్న తేడా లేకుండా సినిమాలను ఆదరిస్తారు అన్నది ఈమూవీ సాధించిన ఘన విజయం తెలియ చేస్తోంది. ఇప్పుడు ఈమూవీని తెలుగులో డబ్ చేయాలా లేదంటే ఎవరైనా యంగ్ హీరోతో రీమేక్ చేయాలా అన్న ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి చిన్న సినిమాలను డీల్ చేయగల దర్శకుడు టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎవరు అన్న విషయం పై కూడ ఈమూవీ రీమేక్ ఆధారపడి ఉంటుంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: