టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా ఆశక రంగనాథ్ హీరోయిన్ గా అల్లరి నరేష్ రాజ్ , తరుణ్ కీలక పాత్రల లో ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ బిన్నీ దర్శకత్వంలో "నా సామి రంగ" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా లో రావు రమేష్ , నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టి డీసెంట్ విజయాన్ని అందుకుంది . ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఇక పోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించి న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.

సినిమా యొక్క శాటిలైట్ హక్కులను "స్టార్ మా" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: