టాలీవుడ్ స్టార్ హీరోస్ బాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ కలిసి కట్టుగా సినిమాలు చేయడం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. అలా ఇటివల ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించిన ఆది పురుష్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కనిపించాడు. దాంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో సైతం బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్  కనిపించబోతున్నాడు. ఆ తర్వాత హ్రితిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వార్ 2 సినిమా కూడా రాబోతోంది. ఆ తర్వాత రామాయణం లో రణబీర్ కపూర్ యష్ కలిసి కనిపించబోతున్నారు.

ఇలా నార్త్ సౌత్ స్టార్స్ అందరూ కలిసి సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే ఇప్పుడు మరొక సెన్సేషనల్ కాంబినేషన్ కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయిలో చూపించిన రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. మహేశ్ బాబు సినిమా కెరియర్ లో 29వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా బిగ్ స్టార్ నటించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో విలన్ రోల్స్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటాయి. ఈ మూవీలో విలన్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందట. హీరో, విలన్ రోల్స్ నువ్వానేనా అని పోటాపోటీగా తలపడేలా ఉంటాయట. అందుకే విలన్ రోల్ కోసం బిగ్ స్టార్ ని రంగంలోకి దింపాలని చూస్తున్నారట. ఈ క్రమంలో రాజమౌళి దృష్టి హృతిక్ రోషన్ పై పడినట్లు సమాచారం. ఇప్పటికే హృతిక్ కొన్ని సినిమాల్లో నెగటివ్ రోల్స్ పోషించి అదరగొట్టాడు. పైగా రాజమౌళి సినిమా అంటే ఏమాత్రం వెనకాడకుండా హృతిక్ అంగీకరించే అవకాశముంది. హృతిక్ విలన్ గా చేయడానికి అంగీకరిస్తే ఒక్కసారిగా 'SSMB 29' ప్రాజెక్ట్ క్రేజ్ మరో స్థాయికి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే హృతిక్ లాంటి స్టార్ తోడైతే నార్త్ లో ఖచ్చితంగా రికార్డు కలెక్షన్స్ వస్తాయి. మరోవైపు హృతిక్ కూడా తన మార్కెట్ ని పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: