ఫిదా ఫేమ్ గాయత్రి గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ సినిమాల కంటే వివాదాల తోనే ఎంతో పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ భామనటించిన తెలుగు మూవీ డబుల్ ఇంజిన్ ఓటీటీలోకి రాబోతోంది.మార్చి 29 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి రోహిత్ పెనుమాత్స దర్శకత్వం వహించాడు. రోహిత్‌ మరియి శశి ఈ సినిమాకు కథను అందించారు.12 రోజులలో కేవలం 30 లక్షల బడ్జెట్‌తో  ప్రయోగాత్మకంగా డబుల్ ఇంజిన్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో ముని, అజిత్ కుమార్‌, రోహిత్ నరసింహ మరియు ముఖ్య పాత్రలు పోషించారు. తెలంగాణ యాసతో ఎంతో రియలిస్టిక్‌గా ఈ సినిమా రూపొందింది. డబుల్ ఇంజిన్ ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించాడు.వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు రోహిత్ డబుల్ ఇంజిన్ మూవీని తెరకెక్కించాడు. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న డానీ తన చిన్ననాటి స్నేహితుడు గోపిని కలవడానికి ఓ పల్లెటూరికి వస్తాడు.రెండు తలల పామును అమ్మి భారీగా డబ్బు సంపాదించాలని డానీ, గోపి పధకం వేస్తారు..పామును పట్టుకునే ప్రయత్నంలో వారు ఎలాంటి కష్టాలు పడ్డారు.. వారికి రెండు తలల పాము వారికి దొరికిందా.. లేదా? అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాలో ఒక్క గాయత్రి గుప్తా మినహా మిగిలిన వారందరూ కొత్త నటీనుటులే కావడం విశేషం..ఈ ఏడాది జనవరి 5న డబుల్ ఇంజిన్ మూవీ థియేటర్లలో విడుదల అయింది.. కేవలం గంట నలభై ఐదు నిమిషాల నిడివితోనే ఈ మూవీని తెరకెక్కించారు. తక్కువ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. అదే రోజు పలు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పోటీగా విడుదల చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమా పై అంతగా ఆసక్తి చూపించలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: