యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , మాస్ మహారాజా రవితేజ , నచురల్ స్టార్ నాని , యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీగా సమయాన్ని గడుపుతున్నారు . ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ మూవీ లకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతం లో జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసు కుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాదు లో ఎన్టీఆర్ , సైఫ్ అలీ ఖాన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ బృందం వారు లక్నో లో రవితేజ మరియు కొంత మంది ఇతరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో నాని మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు . వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ ప్రస్తుతం తమ్ముడు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: