
ఇక వాటన్నిటిని దాటి తన్ను తాను కొత్త గా చూపించుకోవడానికి ఈ సినిమా ట్రై చేస్తున్నాడు ఈ సీనియర్ దర్శకుడు . మాట్లాడితే వింతగా అనిపిస్తుంది కానీ .. స్టార్ దర్శకుడు కొరటాల శివ కూడా దేవరతో ఇలాంటి ఓ ప్రయత్నమే చేశారు .. ఆచార్య తర్వాత తన మేకింగ్ పరంగా అప్డేట్ అయ్యారు కొరటాల .. ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమాలో ఇది కనిపించింది . ఇక కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన చందూ మొండేటి .. తండేల్ తో తొలిసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు .. ఈ సినిమా అవుట్ ఫుట్ పై చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది ..
2025 ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకు ముందుకు రానుంది. విజయాల కోసం కొత్త ఇమేజ్ వైపు పరుగు తీస్తున్న దర్శకులు కొందరైతే .. కొత్త ప్రపంచాలు క్రియేట్ చేస్తూ విజయాలు అందుకుంటున్న వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు .. హనుమాన్ తో యూనివర్స్ ను ఓపెన్ చేసిన ప్రశాంత్ వర్మ .. అదిరా , జై హనుమాన్ , మహాకాళి సినిమాలని ఇదే ప్రపంచంలో తీసుకురాబోతున్నాడు .. మొత్తానికి ఎలా చేసినా విజయం ముఖ్యం అంటూ మన దర్శకుల ఆలోచన ముందుకు వెళుతుంది .