ప్రస్తుతం టీవీ ఆన్ చేసిన  సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  అల్లు అర్జున్ అరెస్ట్  వ్యవహారం గురించి వినిపిస్తోంది. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే మహిళ సంధ్య థియేటర్ లో ఏర్పడిన తొక్కిసలాటలో మరణించడంతో ఆ కేసు విషయమై అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇదంతా ఒక న్యాయవ్యవస్థ ప్రకారం జరిగింది. కానీ ఆయన అరెస్టును  పూర్తిస్థాయిలో రేవంత్ రెడ్డి చేసినట్టుగా  చిత్రీకరణ చేస్తూ సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో విపరీతంగా వార్తలు రాస్తూ వస్తున్నారు. అసలు ఈ తప్పుకు కారణం అల్లు అర్జున్ సినిమా కాదన్నట్టు రేవంత్ రెడ్డి చేశాడు అన్నట్టు  వార్తలు క్రియేట్ చేస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి కూడా స్పందించి చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పారు. అయినా వార్తలు ఆగడం లేదు.  

ఇదే క్రమంలో  సోషల్ మీడియా వేదికగా  సినీ పరిశ్రమ మొత్తం  రేవంత్ రెడ్డికి అగైనెస్ట్  అయినట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న హైడ్రా పేరుతో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో  సినీ ఇండస్ట్రీ వాళ్లతో కాస్త విభేదాలు ఏర్పడ్డాయి. ఇక అప్పటినుంచి రేవంత్ రెడ్డి పై కాస్త కోపంగానే ఉన్న సినీ ఇండస్ట్రీ, తాజాగా మోహన్ బాబు  ఇష్యూను కూడా రేవంత్ రెడ్డి పైనే నెట్టివేశారు. అది మరవకముందే మరోసారి అల్లు అర్జున్ అరెస్టు అవ్వడంతో  సీఎం రేవంత్ రెడ్డిపై సినీ ఇండస్ట్రీ మొత్తం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

 ఇదే తరుణంలో ఆయనపై విపరీతమైనటువంటి వార్తలు రాస్తూ ట్రోల్ చేస్తున్నారు.  గత ప్రభుత్వాలు సినీ ప్రముఖులందరితో చాలా స్నేహపూర్వకంగా మెదిలాయని, రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా ఉన్నారని అభిప్రాయాలు వినిపిస్తుండడం గమనార్హం. మరి ఈ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే మాత్రం సినీ ఇండస్ట్రీ వారు రేవంత్ రెడ్డిపై ఎలా కక్ష తీర్చుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: