బేసిగ్గా నేపాల్‌లో పుట్టిన ఉదిత్ తన పాటతో ఎల్లలను చెరిపేయడంలో వందశాతం విజయాన్ని సాధించాడు. రేడియో గాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం భారతదేశ చిత్రపరిశమలన్నింటిలోనూ ప్రముఖ గాయకుడిగా తన పేరుని లిఖించినుకునే స్థాయికి వచ్చాడంటే సాధారణ విషయం కాదు. తన గాన ప్రతిభతో ఉదిత్ నారాయణ్ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి కూడా ఎంపిక కావడం విశేషం. మొదట నేపాల్‌లో రేడియో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా ఏడేళ్లు పనిచేసిన ప్రతిభకు మెచ్చి అక్కడి భారతీయ ఎంబసీ అధికారులు భారతీయ విద్యాభవన్‌లో శాస్త్రీయ సంగీతం నేర్చుకొనేందుకు స్కాలర్‌షిప్ ఇచ్చి మరీ ఆహ్వానించారు. ఈ క్రమంలో "ఉన్నీస్ బీస్" చిత్రంతో వెండితెరకు ఉదిత్ పరిచయమయ్యాడు.
అసలు విషయంలోకి వెళితే... రీసెంట్‌గా ఉదిత్ నారాయణ్ మ్యూజిక్ కన్సర్ట్ చాలా హాట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదిత్ చేసిన పనిని గురించి కొందరు కుహనా మేధావులు సోషల్ మీడియాలో కూయడం మొదలు పెట్టారు. కన్సర్ట్‌లో భాగంగా.. ఒక మహిళ అభిమాని సెల్ఫీ తీసుకుందామని ఉదిత్ దగ్గరికి వెళ్లగా సెల్ఫీ దిగిన అనంతరం ఆమె అతని చెంపపై ముద్దు పెడుతుంది. దీంతో ఉదిత్ కూడా ఆ అభిమానికి కిస్ ఇవ్వడంతో లేడి ఫ్యాన్ షాక్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా కొంతమంది దీనిపై పెడార్ధాలు తీస్తున్నారు. అయితే ఈ ఘటనపై మరికొంతమంది నెటిజన్లు ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి