హీరో నాని కాదు కాదు వైలెంట్ హీరో నాని. వామ్మో నాని గాడిలో ఇంత వైలెంట్ యాక్టర్ దాగున్నాడా..? నాని పర్ఫామెన్స్ వేరే లెవెల్.. హిట్ కొట్టావ్ పోరా నానిగా.. ఇలా ఒకటి కాదు రెండు కాదు గత 24 గంటలు నుంచి సోషల్ మీడియాలో నాచురల్ స్టార్ నాని కి సంబంధించిన వార్తలు మారుమ్రోగిపోతున్నాయి . నాని అనగానే అందరికీ సాఫ్ట్ హీరోనే గుర్తొస్తాడు . కానీ సాఫ్ట్ కాదు ఇది నా ఒరిజినల్ అంటూ నాని లోని ఒరిజినల్ యాంగిల్ ను బయటపెట్టాడు ఈ హిట్ 3  సినిమా ద్వారా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.


నేచురల్ స్టార్ హీరో నాని నటించిన హిట్ 3 సినిమా తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయి ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.  ఆ వైలెన్స్ ఏందిరా బాబు అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు . కానీ ఎంత వైలెన్స్ ఉన్న ఆల్టర్నేట్ గా సినిమాలో దాన్ని కూల్ చేస్తే సీన్స్  కూడా ఉండడం గమనార్హం.  కాగా హిట్ త్రీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒకటే ఒక్క మాట . నాని చంపేశాడు.. నాని అదరగొట్టేసాడు.. నాని ఇండస్ట్రీ స్టార్ హీరో.. రియల్ హీరో నానినే..ఇలా మాట్లాడుకుంటున్నారు .



కాగా ఈ సినిమాలో నాని ఒక డైలాగ్ చెప్తాడు . నాని  నలుగురు సిటీకే సభ్యులతో ఫైట్ చేసే మూమెంట్లో ఒక అమ్మాయి "ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వలేవు వెళ్లిపో అంటూ ఒక డైలాగ్ చెప్తుంది". " అప్పుడు నాని నా కెరియర్ నుంచి ఈ మాట వింటూనే వస్తున్నాను అంటూ బోల్డ్ గా ఓ డైలాగ్ చెప్తాడు ". దానికి అర్థం నాని తన కెరియర్ లో కూడా ఈ డైలాగ్ ఎక్కువగా విన్నాడు అని అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. హీరో నాని తన కెరీర్ లో సెటివ్ అవ్వడానికి చాలా చాలా స్ట్రగుల్ పడ్డాడు . మరీ ముఖ్యంగా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా టఫ్ జాబ్. ఎంతోమంది ఆయనను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు.  తొక్కేయడానికి ట్రై చేసే వాళ్ళు ఉంటారు. అదే విషయాన్ని ఈ విధంగా సినిమాల రూపంలో చెప్పాడు నాని అంటూ మాట్లాడుతున్నారు . ఇప్పుడు ఈ డైలాగ్ బాగా కాంట్రవర్షియల్ గా మారింది . అంతేకాదు నాని పర్ఫార్మ్ చేసిన విధానం చూసి బిగ్ స్టార్స్ కి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: