మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా షూటిం గ్ లలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభ ర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతోంది. అనిల్, చిరంజీవి కాంబినేష న్లో రాబోయే మొదటి చిత్రం ఇదే కావడం విశేషం "మెగా 157" పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తొందర్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను అనిల్ రావిపూడి 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

 ఈ సమయంలోనే చిరంజీవికి షాకింగ్ న్యూస్ ఎదురయింది. సంక్రాంతి కానుక గా చిరంజీవి సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్న సమయం లో అదే రోజు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న "అనగనగా ఒక రాజు" సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అదే రోజున "మెగా 157" సినిమా కూడా రిలీజ్ కానుంది. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించినప్పటికీ ఈ సినిమా విషయంలో కాస్త గందరగోళం నెలకొంటుంది.

ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో అనే సందేహంలో చిరంజీవి అభిమానులు పడ్డారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సినిమాలకి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమాల కోసం అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తారు. అదే రోజున చిరంజీవి సినిమా రావడంతో అభిమానులు కాస్త భయపడుతున్నారు. నవీన్ పోలిశెట్టి సినిమా వల్ల మెగాస్టార్ చిరంజీవికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని అనుకుంటున్నారు. వీరిద్దరి సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: