
అలానే తెలుగు ప్రజలను వీరిద్దరూ తమదైన రొమాన్స్ తో అలరించేవారు. ఇదిలా ఉంటే ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఎన్నో సినిమాల్లో జంటగా చేసిన ఎన్టీఆర్, సావిత్రి ఒక్క మూవీలో మాత్రం అన్నా చెల్లిగా నటించారు .వీళ్ళిద్దరూ అన్నా చెల్లిగా నటించడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంసంగా మారింది .చర్చనే సినిమాపై ప్రత్యేకమైన అటెన్షన్ క్రియేట్ చేసింది. 'రక్తసంబంధం 'అన్నా చెల్లి అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ 1962లో విడుదల అయింది. ఫ్యామిలీ డ్రామాగా తరికెక్కిన ఈ మూవీకి వి.మధుసూదనరావు , దర్శకుడు సుందర్ లాల్ నహత, దూండి నిర్మాతలు. ఇందులో ఎన్టీఆర్ ,సావిత్రితో పాటు కాంతారావు, దేవిక, రేలంగి, ప్రభాకర్ రెడ్డి ,సూర్యకాంతం వంటి వారు కూడా నటించారు .ఈ సినిమాతమిళంలో వచ్చిన `పసమలార్`కి రీమేక్. అందులో సావిత్రి, జెమినీ గణేషన్ నటించడం విశేషం.
ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లిగా నటించిన రక్తసంబంధం సినిమా 1962 నవంబర్ ఒకటిన విడుదలై భారీ విజయాన్ని కొల్లగొట్టింది. 11 సెంటర్లో 100 రోజులు ఆడింది .విజయవాడలో ఏకంగా 25 వారాలు పైగానే ఆడింది. అంతే కాదు ఈ సినిమా 1988లో మరోసారి రీ రిలీజ్ చేశారు. అప్పుడు కూడా మంచి ఆదరణ పొందడం విశేషం లవర్స్ గా భార్యా,భర్తలు గా వెండితెరపై పరిచయమైన వీళ్ళిద్దరూ రొమాన్స్ తో రెచ్చిపోయిన ఎన్టీఆర్ ,సావిత్రి అన్నా చెల్లి గాను అంతే అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులను అదేవిధంగా గెలుచుకున్నారు.. వీరిద్దరి కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది..