
మరీ ముఖ్యంగా నందమూరి అభిమానులు ఆయనంటే అంత అభిమానం ..ఇష్టం .. ప్రేమ . కాగా నందమూరి బాలయ్య ఇప్పటివరకు ఎన్నో పుట్టిన రోజులు జరుపుకున్నారు . కానీ అన్నిటికన్నా ఈ పుట్టిన రోజు చాలా చాలా స్పెషల్ అంటున్నారు అభిమానులు . అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య పుట్టినరోజు నాడు మోక్షజ్ఞ డెబ్యు సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రాబోతుంది అంటూ తెలుస్తుంది . ఆల్రెడీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాని అనౌన్స్ చేశారు . కానీ అది క్యాన్సిల్ అయిపోయినట్లు తెలుస్తుంది .
ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో బాలయ్య ఆదిత్య 999 అనే సినిమాను ఓకే చేశారు. ఇదే సినిమా ద్వారా మోక్షజ్ఞ డెబ్యూ ఉండబోతుంది అంటూ ఓ న్యుస్ బయటకు వచ్చింది . ఆ న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయబోతున్నారట బాలయ్య తన పుట్టినరోజు నాడు . ఈ న్యూస్ ఇప్పుడు సినీ వర్గాలలో బాగా హీట్ పెంచేస్తుంది. ఎప్పుడైతే బాలకృష్ణ తనకి కొడుకు పుట్టాడో తనకు వారసుడిగా నందమూరి ఫ్యామిలీ వారసుడిగా ఇండస్ట్రీలోకి రప్పించాలి అని అప్పుడే డిసైడ్ అయ్యారట . ఆ మూమెంట్ నుంచి మోక్షజ్ఞని హీరో అవ్వాలని మోల్డప్ చేస్తూనే వచ్చారట. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరబోతుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు. ఆదిత్య999 సినిమాలో బాలయ్య మోక్షజ్ఞ కలిసిన నటించబోతున్నారు అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది..!