
నా స్వామి రంగా తర్వాత నాగార్జున వెండి తెర మీద కనిపించబోతున్న సినిమా కూడా ఇదే .. సంవత్సరానికి పైగా గ్యాప్ తీసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. అలాగే ధనుష్ మెయిన్ హీరో అయినప్పటికీ సినిమాలో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ పరంగా ఇద్దరినీ ఎంతగానో బ్యాలెన్స్ చేసి ఉంటారని నమ్మకం టైలర్ తో గట్టిగా వచ్చింది .. అందులోనూ కథను ఉన్నట్టు ఉన్నట్టుగా చూపించే శేఖర్ కమ్ముల డైరెక్షన్ కాబట్టి ఇది మరింత అంచనాలు పెరిగాయి .. రష్మిక , దేవిశ్రీప్రసాద్ సంగీతం డబ్బు , క్రైమ్ తో ముడిపడిన ఇంట్రెస్టింగ్ నేపథ్యం ఇలా సినిమాపై అంతకంతకు ఆసక్తిని పెంచుతున్నాయి .. అందులోను రాజీ లేకుండా ఎక్కువకాలం నిర్మాణం జరుపుకున్న మూవీ కూడా ఇదే .
ఇక ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరి ఉదాల్సిన బాధ్యత కుబేర మీదే ఉంది .. ఒక బిచ్చగాడు కోటీశ్వరుడు అయ్యే క్రమంలో ఎదురయ్యే సామాజిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా శేఖర్ కమ్ముల ఈ సినిమాను తర్కెక్కించారు .. అలాగే పాటలు వేటికవే ఎంతో భిన్నంగా అనిపిస్తున్నాయి .. స్టోరీ కనుక ప్రేక్షకులకు నచ్చితే కుబేరకు కలెక్షన్ వర్షం రావడం ఖాయం .. అయితే సినిమాలో ఎక్కువగా క్లాస్ టచ్ ఉండే శేఖర్ కమ్ముల ఈసారి కమర్షియల్ యాక్షన్ అంశాలను ఎక్కువగా జోడించాడు ధనుష్ లాంటి పెర్ఫార్మర్ దొరికాడు కాబట్టి శేఖర్ నుంచి మంచి మాస్ కంటెన్ ని చూడచ్చని సినీ లవర్స్ ఆశపడుతున్నారు .. మరి ఇది ఎంతవరకు నెరవేరుతుందో ఇంకో రెండు వారాలు ఆగితే అంతా తేలిపోతుంది .