నాచురల్ స్టార్ నాని తాజాగా హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా ... శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే నాని , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే మూవీ ని ఓకే చేశాడు. ఓకే చేయడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ వీడియో అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. హిట్ 3 మూవీ మే 1 వ తేదీన విడుదల అయింది.

దానితో హిట్ 3 మూవీ కి సంబంధించిన పనులు అన్ని ముగిశాక మే 2 వ తేదీ నుండి నాని ది ప్యారడైజ్ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతాడు అని వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన గ్లీమ్స్ వీడియో తో పాటు ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దానితో మే నెల నుండి ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించి జెట్ స్పీడ్ లో ఈ సినిమాను కంప్లీట్ చేసినట్లయితేనే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయగలరు అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్త పరిచారు.

కానీ ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి స్టార్ట్ కాలేదు. దానితో ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల కావడం కష్టం అని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని మార్చి 26 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం మే నెలలో విడుదల చేయాలి అనే ఆలోచనకు ఈ మూవీ బృందం వారు వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: