
అనుపమ నటించిన జానకి వర్సెస్ స్టేటఫ్ కేరళ చిత్రం మరో వారం రోజులలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. దీంతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మలయాళ సినిమా చాలాకాలం తర్వాత రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో కేరళలో అనుపమ సినిమా పై ప్రత్యేక దృష్టి పడింది. సుమారుగా చాలా కాలం తర్వాత అనుపమ మలయాళం సినిమా చేస్తోంది. అయితే ఎందుకు ఇన్నేళ్లు గ్యాప్ ఇచ్చిందనే విషయంపై తాజాగా అనుపమ క్లారిటీ ఇచ్చింది.
హీరోయిన్ గా తాను మలయాళం ఇండస్ట్రీలో నుంచి ఎంట్రీ ఇచ్చిన సమయంలో చాలామంది తనని విమర్శలు చేశారని కొంతమంది తనకు నటననే రాదని పరువు తీసారని. విమర్శలు కూడా చేశారని మంచి కథ కోసం ఎదురు చూశాను.. తనని తాను నిరూపించుకోవడం కోసమే ఇన్నేళ్లు వెయిట్ చేయవలసి వచ్చిందని చెప్పుకొచ్చింది అనుపమ. డైరెక్టర్ ప్రవీణ్ నారాయణ్ చెప్పిన కథ తనకి బాగా నచ్చడం వల్లే ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యానని తెలియజేసింది. తనకి నటన రాదు అంటూ విమర్శించిన వాళ్లే కచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత తాము తప్పుగా మాట్లాడామని అభిప్రాయపడతారని అనుపమ వెల్లడించింది. ఈ చిత్రంలో దీపిక పిల్లై కీలకమైన పాత్రలో నటిస్తోంది.