
మరీ ముఖ్యంగా చిరంజీవి నెంబర్ వన్ గా కొనసాగుతున్న మూమెంట్లో ఆయన ఫోటో ముద్రించుకొని చాలా చాలా పత్రికలు లాభాలు పొందాలు అనే విధంగా ఉండేటివి . ఈ విషయాన్ని రచయిత తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు . ఆయన బయట పట్టిన ఒక విషయం సోషల్ మీడియాలో మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. తోట ప్రసాద్ మాట్లాడుతూ.."అప్పట్లో నేను వర్క్ చేసిన ఓ సంస్ధకి భారీ నష్టాలు నడుస్తూ ఉన్నాయ్. ఆ టైంలో తమని నష్టాల నుంచి గట్టెక్కించే ఓ ఆఫర్ వచ్చింది. తమ బ్రాండ్ కి ప్రచారం కల్పిస్తే భారీ మొత్తం ఇస్తామని వాళ్ళు ఆఫర్ చేశారు. ఆఫర్ బాగుండడంతో ఒప్పేసుకున్నారు. దానితోపాటు ఎక్కువ కాపీలు అమ్ముడు అయ్యేలా చేయాలి. ఎలా? ఈ మూమెంట్లోనే చిరంజీవి ఫోటో కవర్ పేజీ పై కనిపించే విధంగా లిక్కర్ యాడ్ పైన చిరంజీవి ఫోటో ముదిరించారు .
ఫైనల్ ఎడిషన్ కంప్లీట్ కాకుండా ఈ విషయం బయటకు లీక్ అయిపోయింది. ఎలాగోలా చిరంజీవికి తెలిసింది . వెంటనే చిరంజీవి మమ్మల్ని పిలిపించారు. ఏంటిది అని ప్రశ్నించారు . ఆ యాడ్ వేరు మీ ఫోటో వేరు అని చెప్పాము ..కానీ ఆయన వినలేదు . "అది సామాన్యులకి ఎలా అర్థం అవుతుంది..? లిక్కర్ బ్రాండ్ పైన నా ఫోటో ఉంటే నేను లిక్కర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నాను అనుకుంటారు గా..? ఇలాంటివి అసలు ఒప్పుకోను .. " అని కోపంగా కసిరారట. " ఆ బ్రాండ్ తో మాకు మంచి డీల్ వచ్చిందని చెప్పినా కూడా ఆయన ఒప్పుకోలేదట. " నా ఫోటో తీసేయండి లేదంటే లిక్కర్ బ్రాండ్ క్యాన్సిల్ చేసుకోండి " అంటూ తేల్చి చెప్పారట. వేస్తే లిక్కర్ బ్రాండ్ వేసుకోండి లేదంటే నా ఫోటో ఒక్కటే వేయండి అంటూ సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారట . ఇక చేసేది ఏమీ లేక చిరంజీవి ఫోటోనే తొలగించారట. ఈ విషయాన్ని తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు..!!