
టాలీవుడ్ నవమన్మధుడు అక్కినేని అఖిల్ ఎప్పటినుంచో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. ఇటీవల పెళ్లికూడా అయింది. పెళ్లి అయ్యాక హిట్టు పెడితే వ్యక్తిగత జీవితంతో పాటు ... వృత్తి జీవితం కూడా సెటిల్ అయిపోయిన సంతృప్తి కలుగుతుంది. అందుకే అఖిల్ తన ఆశలు అన్ని ఈ సినిమా మీద పెట్టుకున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శ్రీ లీల హీరోయిన్. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఓ పవర్ఫుల్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అందులోను యాక్షన్ కి పెద్ద పీఠ వేశారు.
కథ ఎలా ఉంటుందో ? చూచాయిగా కూడా చెప్పలేదు. ఇదో పరువు హత్య నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. మరో లేయర్లో ఆలయానికి సంబంధించిన కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు విషయాలు ఎలా బ్యాలెన్స్ చేస్తూ కథను ముందుకు నడిపించారు ? అన్నది ఆసక్తికరం. పరువు హత్య నేపథ్యంలో గతంలో చాలా సినిమాలుగా వచ్చిన వాటన్నింటికంటే చాలా భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు దర్శకుడు. లెనిన్ అనే టైటిల్స్ అయితే చాలా ఆసక్తిగా ఉంది. రాయలసీమ స్లాంగ్ కూడా బాగానే పెట్టేసాడు. నాగార్జున - సూర్యదేవర నాగే వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా సినిమాపై అంచనాలు.. అయితే మామూలుగా లేవు. మరి ఈ సినిమాతో నైనా అఖిల్ సూపర్ హిట్ కొడతాడేమో చూడాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు