
ధనుష్ యాక్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్ . అసలు ధనుష్ లేకపోతే ఈ సినిమా నథింగ్ అని చెప్పడంలో సందేహమే లేదు. అలాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ రాసుకున్నారు శేఖర్ కమ్ముల. అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమాలో ముందుగా ధనుష్ పాత్ర కోసం టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అని అనుకున్నారట . ఆయన కథ కూడా వివరించారట. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ కథ పట్ల పెద్ద ఇంట్రెస్ట్ చూప లేదట. అప్పటికే ఆయన కమిట్ అయి ఉన్న సినిమాల కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకుండా చేయడం బిగ్ రీజన్ అంటూ అప్పట్లో సినీ మేకర్స్ ద్వారా ఓ న్యూస్ బయటకు వచ్చింది .
కానీ కొంతమంది మాత్రం విజయ్ దేవరకొండ రేంజ్ కి క్రేజ్ కి ఇలా భిక్షం ఎత్తితే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందని భయపడ్డాడేమో..? అందుకే ఈ సినిమా రిజెక్ట్ చేశారేమో అంటూ మాట్లాడుకున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ ఒక మంచి హిట్ సినిమాను మిస్ అయిపోయారు. ఏ మాటకు ఆ మాట ధనుష్ కాకుండా ఈ పాత్రలో విజయ్ దేవరకొండ అయితే మరింత బాగుండేది అంటున్నారు మరి కొంతమంది జనాలు. విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న ఈ రోల్ హీరో ధనుష్ ఖాతాలో పడింది . సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా సాధిస్తుందో మరికొద్ది గంటలు వేచి చూస్తే తెలిసిపోతుంది..!!!