బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ నటుల లో ఒకరు అయినటువంటి సల్మాన్ ఖాన్ సినిమా విషయాలతో మాత్రమే కాకుండా ఇతర విషయాలతో కూడా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కండల వీరుడిగా పేరు సంపాదించుకున్న ఈయన ఎన్నో విజయాలను అందుకొని కేవలం హిందీ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్నాడు. అందులో తన ప్రేమ వ్యవహారాల గురించి సల్మాన్ ఓపెన్ అయ్యాడు.

తాజాగా సల్మాన్ కాఫీ విత్ కరణ్ లో భాగంగా మాట్లాడుతూ ... తనకు ఇప్పటివరకు కేవలం ముగ్గురు , నలుగురు మాత్రమే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని సల్మాన్ తాజాగా చెప్పుకొచ్చాడు. అలాగే ఒకరితో 7 నుండి 8 సంవత్సరాలు , మరొకరితో 12 సంవత్సరాలు మాత్రమే రిలేషన్ షిప్ కొనసాగించగలిగినట్లు పేర్కొన్నాడు. లవ్ ఎఫైర్స్ లో తాను చాలా పూర్ అని తాజాగా సల్మాన్ ఖాన్ పేర్కొన్నాడు. సల్మాన్ ఖాన్ గతంలో ఐశ్వర్యా రాయ్ , కత్రినా కైఫ్ , సంగీత బిజ్లానీ , లూలియా వంతుర్ లాంటి తదితరులతో ప్రేమాయణం నడిపినట్లు గతంలో అనేక వార్తలు వచ్చాయి.

ఇక కాసేపు సల్మాన్ సినిమా విషయాల్లోకి వెళితే ... ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న మంచి విజయాలు మాత్రం ఈయనకు దక్కడం లేదు. ఆఖరుగా సల్మాన్ , ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన సికిందర్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: