
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో థియేటర్ల లోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు శరవేగంగా నడుస్తున్నాయి. ఇక విష్ణు అయితే ఈ సినిమా పై భారీ నమ్మకాలే పెట్టుకున్నాడు. భారీ క్యాస్టింగ్ తో పాటు బిగ్ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందా ? అని దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులతో పాటు అటు డివోషనల్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ చాలా చోట్ల స్టార్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా పై అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఈ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో అక్కడ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అమెరికాలో బుకింగ్స్ జోరు మామూలుగా లేదు. ఇక వరల్డ్ వైడ్ గా కన్నప్ప సినిమాను 5,400 స్క్రీన్లలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ ఉండడంతో పాటు పలు భాషల సూపర్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమా చేయడంతో ఓపెనింగ్ డే రికార్డులు కొల్లగొడుతుందని అంటున్నారు.
ఇక ఇండియాలో ఈ సినిమాను 4,300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రతి ప్రీమియం-ఫార్మాట్ ఆడిటోరియం IMAX - స్క్రీన్ X - 4DX లలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక ఓవర్సీస్‌లో 1,100పైగా స్క్రీన్లు, 200లకు పైగా యూస్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. కన్నప్ప డే 1 ఖచ్చితంగా రు. 100 కోట్ల తో అందరిని ఆశ్చర్య పరుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు