నిన్నటి రోజున సినీ హీరో శ్రీరామ్ డ్రగ్స్ తీసుకున్నారనే  ఆధారాలతో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.. చెన్నైలోని కొకేన్ రాకెట్ పైన సోదాలు సైతం నిర్వహించినప్పుడు హీరో శ్రీరామ్ పేరు బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున రాత్రి ఆయన అరెస్టు చేసి ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచినట్లు తెలుస్తోంది. సుమారుగా హీరో శ్రీరామ్ 8 పాటు పోలీసులు సైతం విచారణ జరిపి ఇరువురి వాదనలు విన్న తర్వాత కోర్టు జులై 7 వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ ను  విధించింది శ్రీరామ్ కు.



అయితే ఇదే కేసులో సేలం జిల్లాకి చెందిన ప్రదీప్ కుమార్, ఘనా దేశానికి చెందిన  జాన్ పోలీసులు కొకైన్ విక్రయిస్తూ ఉండగా పట్టుకొని అరెస్టు చేశారు. అయితే ఈ విచారణలో అటు ప్రదీప్, జాన్, జెర్రీక్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రదీప్ కూడా చెన్నైలో చాలామంది వ్యక్తులకు డ్రక్స్ అమ్మినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చెన్నైకి చెందిన మాజీ పొలిటికల్ నాయకులతోపాటుగా సినీ సెలబ్రిటీలు కూడా నార్కోటిక్ సరఫరా చేసినట్లుగా వెల్లడించడం జరిగింది.


ఇక ఇదే లిస్టులో హీరో శ్రీరామ్ పేరు కూడా ఉన్నది .జూన్ 23న నుంగంబాక్కం నార్కోటిక్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా శ్రీరామ్ ను పిలిచి మరియు విచారణ చేయడమే కాకుండా తన రక్త శాంపుల్స్ లో టెస్ట్ కు పంపించగా అందులో కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు.దీంతో పూర్తి నివేదికల ఆధారంగా పోలీసుల సైతం హీరో శ్రీరామ్ ని అరెస్టు చేశారు.. దీంతో ఈ విషయం ఒక్కసారిగా అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి రోజున రాత్రి 11:30 నిమిషాలకు కోర్టు ముందు హాజరు పరచగా జులై 7వ తేదీ వరకు రిమాండ్ పంపించాలంటూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది. మరి వీటి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారని విషయం బయట పడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: