సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది బ్యూటీలకు విజయాలతో సంబంధం లేకుండా క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇక అలాంటి బ్యూటీలకు ఎంత పారితోషకం ఇచ్చైనా సరే తమ సినిమాలలో పెట్టుకోవడానికి దర్శక, నిర్మాతలు కూడా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. దానితో విజయాలు లేకపోయినా కొంత మంది నటీమణులకు అద్భుతమైన స్థాయిలో పారితోషకాలు దక్కుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఈ వరుసలోకే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల చేరినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే... శ్రీ లీల ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాల్లోని నటించిన అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఈమె నటించిన చాలా సినిమాల్లో తన అందాలతో, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫుల్ కిక్ ను ఎక్కించింది. ఈమెకు విజయాలు పెద్దగా దక్కకపోయినా మంచి గుర్తింపు మాత్రం దక్కింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉత్సద్ భగత్ సింగ్ మూవీ లో హీరోయిన్గా నటిస్తుంది. అఖిల్ హీరోగా రూపొందుతున్న లేనిన్ మూవీ లో ఈమె హీరోయిన్గా సెలెక్ట్ అయినా కొన్ని కారణాల వల్ల ఈమె ఆ సినిమా నుండి తప్పుకుంది. దానితో ఈమె చేతులో ప్రస్తుతం ఒకే ఒక తెలుగు సినిమా ఉంది. కానీ ఈమెకు హిందీ సినిమా నుండి భారీ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. 

పుష్ప 2 మూవీ లోని స్పెషల్ సాంగ్ ద్వారా ఈమెకు హిందీలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి హిందీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె ఒక్క తెలుగు సినిమాకు దాదాపు రెండు కోట్ల వరకు పారితోషకం పుచ్చుకోగా, ఇప్పుడు హిందీ సినిమా కోసం ఏకంగా ఐదు కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా శ్రీ లీల పెద్ద మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: