
చాలామంది బాలీవుడ్ స్టార్స్ కూడా తమ సినిమాలో రష్మికనే ఉండాలి అంటూ పట్టు బడుతున్నారు . కానీ మన తెలుగు హీరోలు మాత్రం రష్మికని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు . ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోలు అదే బాటలో ముందుకు వెళ్తున్నారు . ఆ ముగ్గురు మరెవరో కాదు రెబల్ హీరో ప్రభాస్ ..పాన్ ఇండియా స్టార్ తారక్ ..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఈ ముగ్గురు హీరోలతో రష్మిక ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అంతేకాదు రాబోయే అప్ కమింగ్ ప్రాజెక్టులో కూడా వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్సెస్ లేదు అంటూ తేల్చేస్తున్నారు .
దానికి కారణం స్వయాన ఈ హీరోస్. రష్మిక మందన్నా తమ సినిమాలో వద్దు అంటూ సజెస్ట్ చేస్తున్నారట . ఆమె కి ఉండె క్రేజ్ కి ఈ సినిమాలో నటిస్తే సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం ఆమె తీసుకెళ్లి పోతుంది. హీరోలకి సక్సెస్ రాదు. ఆ కారణంగానే హిట్ లేని హీరోయిన్ లని తీసుకోవాలని ఆ హీరోలు ఫిక్స్ అయ్యి మేకర్స్ కి చెపుతున్నారట. దీంతో ఈ హీరోల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . అయితే పాన్ ఇండియా స్టార్ట్ అయిన అల్లు అర్జున్ మాత్రం రష్మిక పేరుని జపిస్తున్నారు. తన నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా ఆమెనే చూస్ చేసుకుంటూ ఉండడం కొంతమందికి విడ్డూరంగా అనిపిస్తుంది. పక్క హీరోస్ ఎంత తెలివితేటలతో ఆలోచిస్తున్నారు . ఒకసారి ఒక హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ హీరోయిన్ కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వట్లేదు . కొత్త బ్యూటీలకి ఛాన్స్ ఇస్తున్నాడు . మరి అల్లు అర్జున్ ఆలా చేయొచ్చుగా అంటూ ట్రోల్ చేస్తున్నారు . చూద్దాం మరి అల్లు అర్జున్ ఏం చేస్తాడు అనేది..? కొందరు మాత్రం అల్లు అర్జున్ ని ఏకాకి చేసేసారు అని మిగతా హీరోలు అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. కానీ స్టార్ హీరోస్ మాత్రం అదేం పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్ళు చూసుకుంటున్నారు..!!