
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రంలోని కీలకమైన సన్నివేశం రీ షూటింగ్ చేయడంలో బిజీగా ఉన్నారట. ప్రతి దృశ్యాన్ని కూడా ఫర్ఫెక్ట్ గా తీర్చిదిద్దే విషయంలో రాజమౌళి ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారనే విధంగా టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు కూడా తన ఫిట్నెస్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు.ఈ చిత్రంలోని ఒక కీలకమైన డ్యాన్స్ సన్నివేశానికి సంబంధించి రిహార్సల్ కూడా ముగించేసారట. ఈ డ్యాన్స్ మహేష్ అభిమానులను చాలా ఆకట్టుకుంటుందని సమాచారం.
SSMB 29 చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా బడ్జెట్ కూడా రూ .1000 కోట్లకు పైగా ఉంటుందని ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు నటీనటులను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టు 9వ తేదీన ఒక గుడ్ న్యూస్ రాబోతోందని వినిపిస్తోంది. మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేయబోతున్నారనే న్యూస్ టాలీవుడ్లో వైరల్ గా మారుతోంది. ఈ విషయం పైన రాజమౌళి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి మరి.