
అయితే సినిమా ఇండస్ట్రీలో అది చాలా ఉందని వెల్లడించారు. నటులకు దొరికే మర్యాద నటీమణులకు ఇక్కడ ఇవ్వరని అన్నారు. రెమ్యునరేషన్ విషయంలో సైతం సమానత్వం లేదని ఆమె అన్నారు. హీరోలకు అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని హీరోయిన్లకు మాతం తగ్గించి ఇస్తున్నారని ఈ పరిస్థితి మారాలని ఈ పక్షపాత ధోరణి మారాలని ఆమె అన్నారు.
ఇకపోతే సినిమాలో కొందరు నటులు ఉన్నారని వారు మహిళల మధ్య మంచివారిగా కనిపించే ప్రయత్నం చేస్తారని తెలిపారు. అలాంటి మేకవన్నె పులులు సమయం వచ్చినప్పుడు వారి అసలు రంగును బయట పెడతారని వెల్లడించారు. అలా గత ఐదేళ్లుగా ముఖానికి అందమైన మాస్క్ వేసుకున్న పలువురు నటులను తానూ చూశానని చెప్పుకొచ్చారు. వాళ్లంతా బుద్ధిమంతులు అని భావించరాదని ఆమె అన్నారు.
ఏ సమయాలలో నటీమణులతో మంచిగా ఉండాలో వారికి తెలుసని మాళవిక చెప్పుకొచ్చారు. కానీ కెమెరా వెనుక వారు ఎలా మారతారనేది తాను కళ్లారా చూశానని మాళవిక మోహన్ చెప్పుకొచ్చారు. అయితే మాళవిక మోహనన్ కు ఎదురైన చేదు అనుభవాలు ఏంటి? ఆమె ఎందుకు ఇలా మాట్లాడారు? అనే ప్రశ్నలకు మాత్రం జవాబులు దొరకాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు