
వరి ముఖ్యంగా ఆయన కెరియర్ లోనే హరిహర వీరమల్లు సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించింది. హరిహర వీరమల్లు సినిమా మొత్తం మొదటి రోజు. 44.20 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఓవర్ ఆల్ గా వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షో లతో కలిపి మొత్తం 70 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది అని వెల్లడించాయి ట్రేడ్ వర్గాలు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఇవి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ . అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో వీరమల్లు 102 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది . ఈ లెక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జనాలకి ఎంత బాగా నచ్చేసింది అనేది అర్థం చేసుకోవచ్చు.
అయితే తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు . ఆయన సినిమా హిట్ అవుతుంది . మరి హిందీ పరిస్థితి ఏంటి? హిందీలో హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది ..? కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..? అంటే మాత్రం హిందీలో కూడా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. హిందీ బెల్ట్ పై ఈ సినిమా మొదటి రోజు 80 లక్షల గ్రాస్ ..45 లక్షల నెట్ వసూళ్లు రాబటిన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . అక్కడ దాదాపు 400 స్క్రీన్ లల్లో ఈ సినిమా విడుదలైంది . మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది . పైగా అక్కడ "సైయిరా" సినిమా పోటీలో ఉన్న కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. సినిమా ఇంకా సరికొత్త రికార్డు ల్త్ నెలకొల్పుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!