
ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేశారు. కింగ్ డమ్ ట్రైలర్‌కు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే సినిమా యాక్షన్, ఎమోషన్, క్లాస్ & మాస్ అంశాల మిశ్రమంగా ఉంటుందని అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌తో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ మీద హైప్ మరింత పెరిగిపోయింది. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మార్కెట్‌ను ఎప్పుడో టార్గెట్ చేస్తున్నాడు.
లైగర్ సినిమాతో అనుకున్న ఫలితం రాకపోయినా, ‘కింగ్ డమ్’ మాత్రం ఆయనకి నెక్స్ట్ బిగ్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను జూలై 31న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. విజయ్ మార్క్ డైలాగులు, గౌతమ్ న్యారేషన్, అనిరుధ్ మ్యూజిక్ అన్నీ కలిస్తే ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఫైర్ పెట్టడం ఖాయం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి ట్రైలర్‌తో ఎంతవరకు మాస్‌ను ఆకట్టుకుంటారో చూడాలి. రౌడీ హీరో ‘కింగ్’గా ఎలా అదరగొడతాడో ఈ జూలై 26న క్లారిటీ వచ్చేస్తుంది!