రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాక సినీ పరిశ్రమకు కొన్ని వాస్తవాలు మారిపోయాయి. టికెట్ ధరలు పెంచుకోవడం, బెనిఫిట్ షోలు వేయడం మునుపటిలా కష్టంగా లేకుండా పోయింది. తెలంగాణలో ఒకానొక సమయంలో పుష్ప-2 ప్రీమియర్ వేదికగా జరిగిన సంఘటనల కారణంగా కొంత కాలంగా అదనపు రేట్లకు బ్రేక్ పడినా, ఇప్పుడు మళ్లీ మినహాయింపులు రావడం స్టార్టైంది. ప్రత్యేకంగా 'హరిహర వీరమల్లు' సినిమాకైతే చారిత్రక నేపథ్యంతో అన్న కారణంతో టికెట్ రేట్లకు భారీగా మినహాయింపు దక్కింది. రేట్లు డబుల్ – టాక్ హాఫ్! .. ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా టికెట్ల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి.

సింగిల్ స్క్రీన్లో రూ. 200 - రూ. 300, మల్టీప్లెక్సుల్లో రూ. 400 - రూ. 500 దాకా చెల్లించాల్సి వచ్చింది. మొదటి రోజు ప్రీమియర్స్‌కి బాగానే రెస్పాన్స్ వచ్చిందిలే అని నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అదే షోల నుంచే వచ్చిన నెగటివ్ టాక్… మొదటి రోజు ఆక్యుపెన్సీలపై పెద్ద ఎఫెక్ట్ చూపించింది. టాక్ ప్లస్ రేట్ = థియేటర్ ఖాళీ! ..  ఓ సినిమాకు టాక్ నెగెటివ్ అయితేనే జనాలు వెనక్కి తగ్గుతారు. అలాంటప్పుడు టికెట్ రేట్లు పెంచితే ఎలా వస్తారు? ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి రూ.150- రూ. 200 మినిమమ్ అయినప్పుడు… ఒక కుటుంబం సినిమాకెళ్లాలంటే వెయ్యి రూపాయల దగ్గర ఖర్చు కావాల్సిన పరిస్థితి. అభిమానంతో ఎంకరేజ్ చేయాలనుకున్నవారే భయపడి వెనక్కి తగ్గారు. డబ్బు లాభం కాదు – డబ్బా దెబ్బ అయింది! .. ‘హరిహర వీరమల్లు’కి మొదటి రోజు తర్వాత 70-80 శాతం వసూళ్లు డ్రాప్ అయినట్టు ట్రేడ్ టాక్.


ఇది టాక్ వల్ల మాత్రమే కాదు – అధిక టికెట్ రేట్లు కారణంగా ప్రేక్షకుల నిరాకరణ వల్ల కూడా అని స్పష్టంగా చెప్పాలి. అదే సినిమా నార్మల్ రేట్లతో వచ్చి ఉంటే, బుకింగ్స్ మెరుగ్గా ఉండే అవకాశం ఉండేది.  బెనిఫిట్ షోలు వేసినా, ఫలితం బెనిఫిట్ ఇవ్వలేదన్నమాట!.. దక్షిణాది మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లోనే టికెట్ల ధరలు అత్యధికం. మరి అదే అదనపు రేట్లు మళ్లీ మళ్లీ పెడుతూ వెళ్లితే, ప్రేక్షకులు ఎందుకు థియేటర్లకు వస్తారు? క్రేజ్ ఉన్న సినిమాలకే ఇలా చేస్తే, ఔట్‌పుట్ బాగోలేకపోతే జనం అసహనం పెరుగుతుంది. వీకెండ్‌లో లాభాల కోసం చేసే ఈ ఆలోచన, థియేటర్ల నుంచి ప్రేక్షకులను మరింత దూరం చేస్తోందన్న నిజాన్ని గుర్తించాల్సిన సమయం ఇది. రేటు పెంచడం కాదు… కంటెంట్ పెంచితేనే క్రౌడ్ వస్తుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: