
కింగ్ డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ అదృష్టాన్ని పరీక్షించుకోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే యుఎస్ లో ఈ సినిమా షోలు ప్రదర్శితం కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్టాఫ్ వేరే లెవెల్ లో ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ టెక్నీకల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ లేదని సెకండాఫ్ బాగానే ఉన్నా ఇంకా ఏదో మిస్ అయిందనే భావన కలుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి కింగ్ డమ్ మూవీతో విజయ్ దేవరకొండ ఏ రేంజ్ విజయాన్ని అందుకున్నారో తెలియాలంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల పబ్లిక్ టాక్ వచ్చే వరకు ఆగాల్సిందే.
అయితే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో మాత్రం ఈ సినిమా అదరగొడుతోంది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 45 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. నైజాం ఏరియాలో కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. విజయ్ దేవరకొండ గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఈ సినిమా ఎంతో బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.