
బాలయ్య సాలిడ్ లైనప్ తో సిద్ధంగా ఉన్నాడు . తనలోని డిఫరెంట్ యాంగిల్ ను బయటపెట్టే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కలయికలో మూడోసారి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది. అయితే క్రిష్ తో ఆల్రెడీ బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ లాంటి మంచి సినిమాలను చేశాడు . ఇప్పుడు వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతుంది . ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది .
అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా తన లక్కీ బ్యూటీ సౌత్ ఇండియా హీరోయిన్ నయనతారను చూస్ చేసుకున్నారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . పెళ్లి తర్వాత నయనతార ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . మరి ముఖ్యంగా పెళ్లి తర్వాత నయనతార తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు ఆమె కమిట్ అయింది . ఆ తర్వాత బాలయ్య తోనే ఆమె మరో తెలుగు సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . బాలయ్య - నయనతారల కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..?? వీళ్ళిద్దరు తెరపై కనిపిస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటే. ఈ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. దీనిపై మరింత క్లారిటీ రావాలి అంటే మరి కొంత కాలం వేచి చూదాల్సిందే..!?