విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ జూలై 31న అన‌గా ఈ రోజు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. గత కొన్నేళ్లుగా విజయ్ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కొట్టకపోయినా, కింగ్డమ్ విషయంలో మాత్రం ప్రేక్షకులు, ట్రేడ్ సర్కిల్స్ లో మంచి బజ్ కనిపిస్తోంది. ఈ సినిమా విజయ్‌కు మళ్లీ మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టే ప్రయత్నం. అందుకే, ఆయన గత రెండు సంవత్సరాలుగా పూర్తిగా కింగ్డమ్ మీదే ఫోకస్ పెట్టారు. మరోవైపు, ఈ మూవీ నిర్మాత నాగ వంశీ భారీ సినిమాల కన్నా బడ్జెట్‌ను పెద్దగా పెట్టి ఈ ప్రాజెక్ట్‌ను వర్కౌట్ చేయించారు.


కింగ్డమ్ సినిమా టోటల్ బడ్జెట్ రూ.130 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో విజయ్ దేవరకొండ పారితోషికం రూ.30 కోట్లు ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. ఇది ఆయన కెరీర్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్. గతంలో లైగర్ సినిమా కోసం ఆయన రూ.20 కోట్లు తీసుకున్నారని సమాచారం. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రూ.7 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర రూ.10 కోట్లు, మ‌రో హీరో సత్యదేవ్ రూ.3 కోట్లు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రూ.1 కోటి రెమ్యునరేషన్ అందుకున్నారని టాక్. ఈ ఫిగర్లు చూస్తే, కింగ్డమ్ సినిమా నిర్మాణ విలువలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతుంది.



సినిమాపై మొదటి నుంచి భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో, ప్రీ-రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్‌గా రూ.110 కోట్లు దాటిందని టాక్. ప్రాముఖ్యమైన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఓవర్సీస్, నార్త్ ఇండియా, మల్టీప్లెక్స్ మార్కెట్లలో కూడా ఈ సినిమా ఫ్యూచర్ పై ట్రేడ్ వర్గాలు ఆశగా చూస్తున్నాయి. విజయ్ దేవరకొండకు ఇది ఓ లైఫ్ చెంజింగ్ మూవీ అవుతుందా ? భారీ రెమ్యునరేషన్, పెద్ద బడ్జెట్, మాస్ ప్యాకేజ్ ఉన్న కంటెంట్ తో కింగ్డమ్ బాక్సాఫీస్ పై ఎలా దూసుకెళ్తుందో చూడాలి. ప్రేక్షకులు మాటిస్తే.. విజయ్‌కు మళ్లీ జోష్ రావడమే గానీ, ఫెయిలైతే మరొక గట్టి గట్టి షాక్ తప్పదు !

మరింత సమాచారం తెలుసుకోండి: