
కూలీ విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. తమిళనాడు రాష్ట్రంలో మాత్రం పూర్తిస్థాయిలో కూలీ మూవీ డామినేషన్ ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కావడం ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరగడానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. సెన్సార్ బోర్డు నుంచి కూలీ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో కూలీ, వార్2 సినిమాల బుకింగ్స్ ఈ నెల 12వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఒక దశలో ఈ సినిమాకు సంబంధించి ఏకంగా గంటకు 50,000 టికెట్లు అమ్ముడయ్యాయని వార్తలు వైరల్ అయ్యాయి. 74 సంవత్సరాల వయస్సులో సైతం రజనీకాంత్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పడానికి ఇదే ప్రూఫ్ అని చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే పెద్దలకు మాత్రమే అలో ఉన్న నేపథ్యంలో కూలీ సినిమా విషయంలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. వార్2 సినిమా రన్ టైం 2 గంటల 51 నిమిషాల 44 సెకన్లు కావడం గమనార్హం. సినిమాలో కియారా బికినీ సీన్ల గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వార్2 సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.