
అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ రికార్డ్స్ బ్రేక్ చేసేలా ఓ సినిమా ఇప్పుడు ఓరిజినల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఆ సినిమా మరేంటో కాదు "మహా అవతార్ నరసింహ" కలెక్షన్స్ సాధించింది . మనకు తెలిసిందే డివోషనల్ యానిమేషన్ చిత్రం "మహావతార్ నరసింహ" ప్రేక్షకులను మెప్పిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తుంది . హుంబులే ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ ఆనిమేషన్ సినిమాను పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉండడం గమనార్హం.
ఈ సినిమాలోని డివోషనల్ కు పిల్లలు పెద్దలు మంత్రముగ్ధుల అయిపోతున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేయగా.. ఇందులోని గ్రాఫిక్స్ కంటెంట్ మొత్తం కూడా హైలెట్ గా మారింది. ప్రేక్షకులను కట్టిపడేస్తుంది . దీంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు . కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర మరే ఇతర సినిమా కూడా పెద్దగా సౌండ్ చేయలేకపోవడంతో.. ఈ సినిమాకి మరింత ప్ల్స్ గా మారింది. కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టేస్తుంది . ఇప్పటికే ఈ సినిమా 210 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ మార్క్ దాటేసి సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది . ఈ వారంలో రెండు బడా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులపడానికి రెడీ అవుతున్నాయి . ఈ గ్యాప్ లో మరికొంత వసూళ్లు తన ఖాతాలో వేసుకుని మరి కొంత వసూళ్ళను "మహావతార్ నరసింహ" తన ఖాతాలో వేసుకునే పనిలో ఉంది . మరి టోటల్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి వాసుళ్ళు రాబడుతుందో తెలియాలి అంటే ఒక మూడు రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది..!!