
కానీ సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. సొంత ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూలు ఇవ్వలేకపోయారు. దీంతో ఆయన కాలర్ ఎగరేసిన సినిమా ఫ్లాప్ అయింది. ఇదే కాదు, గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. అర్జున్ – సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఈవెంట్‌లో కూడా ఎన్టీఆర్ “నేను సినిమా చూశాను, మీరందరూ కూడా కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది” అంటూ కామెంట్ చేశారు. కానీ ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు అందరి కళ్లు దేవర 2 ప్రాజెక్ట్‌పై ఉన్నాయి.
దేవర 2 సినిమా కూడా సక్సెస్ కాకపోతే, జూనియర్ ఎన్టీఆర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ సినిమా పనులు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తాడో..?? మొత్తానికి తారక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ తప్పు చేశాడు అన్న కామెంట్స్ నే ఎక్కువ వినిపిస్తున్నాయి.