ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలన్ని పాన్ ఇండియా చుట్టూ తిరుగుతున్నాయి. సినిమాలో సరైన కంటెంట్ లేకపోయినా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తూ చివరికి బొక్క బోర్లా పడుతున్నారు.  ఓ పది సినిమాలు వస్తే యావరేజ్ గా కనీసం అందులో రెండు, మూడు సినిమాలు కూడా హిట్ అవ్వడం లేదు. దీనికి తోడు ప్రేక్షకులు థియేటర్లలోకి వచ్చి సినిమాలు చూసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా పేరుతో ఎక్కువ బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచడం వల్ల సామాన్యులపై భారం పడుతుంది. ఇదంతా గమనించినటువంటి ప్రేక్షకులు థియేటర్లోకి రావాలంటేనే వణికి పోతున్నారు. దీనికి తోడు రీమేక్ సినిమాలు..సినిమాలో సరైన కంటెంట్ ఉందా లేదా అని కనీసం నిర్మాతలు చూడకుండానే సినిమాలు చేస్తున్నారు. 

అయితే తాజాగా ఒక నిర్మాత తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియా ఎదుట పంచుకున్నారు. అప్పట్లో లెజెండ్, వన్ నేనొక్కడినే, దూకుడు వంటి చిత్రాలు చేసినటువంటి నిర్మాత అనిల్ సుంకర గత కొంతకాలంగా ఏజెంట్, భోళాశంకర్, మహాసముద్రం వంటి చిత్రాలు చేసి దారుణంగా నష్టపోయారు. ప్రస్తుతం ఆయన నిర్మాణాన్ని పక్కనపెట్టి ఓ రియాల్టీ షో చేస్తున్నారు.. దీని లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవితో తీసిన భోళా శంకర్ సినిమా గురించి పరోక్షంగా కామెంట్లు చేశారు.. నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే  ఫ్లాప్ సినిమాలు ఎందుకు తీస్తున్నారు..

అసలు కథ వింటున్నారా లేదా అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు.. ఇన్కంటాక్స్ ఆఫీసులో ఒక క్లర్క్ కూడా  ఎందుకండీ అసలు కథ సరిగ్గా లేని సినిమాలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. నేను చేసింది రీమేక్ అని చెప్పినా ఆయనకు అర్థం కాలేదు. అంటే అనిల్ సుంకర ఇన్ డైరెక్ట్ గా భోళా శంకర్ సినిమా చేసి నష్టపోయానని చెప్పకనే చెప్పేశారు. అయితే ఈ చిత్రం తమిళం వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చింది. సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. రిలీజ్ అయిన తర్వాత దారుణంగా ట్రోలింగ్ కు గురై ప్లాప్ అయిపోయింది. ఈ చిత్రం గురించే ఆయన ఇన్ డైరెక్ట్ గా మాట్లాడడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: