
ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉన్నాడు. అందుకే కొందరు ఆయనపై “సైలెంట్‌గా ఉండటం వెనుక కూడా ఏదో పెద్ద ప్లాన్ ఉంది” అని తమతమ ఊహాగానాలు చెబుతూనే ఉన్నారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే నమ్మారు – “మన హీరో ఏదో ఒక రోజు కచ్చితంగా రిప్లై ఇస్తాడు.. ఒక్కసారి పంచ్ కొడితే చాలు.. సోషల్ మీడియా మొత్తం షాక్ అవుతుంది” అని. అలాగే జరిగింది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని టీమ్ ప్రకటించింది. ఇందులో పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్, ఒక హార్ట్ టచ్ సీక్వెన్స్ కూడా షూట్ చేయబోతున్నారని ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో పాటు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఆ పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ బ్యాక్ లుక్‌లో కనిపించాడు. ఆ ఒక్క లుక్ చాలు… సోషల్ మీడియా మొత్తం హీట్ అయ్యింది. ట్రోల్ చేసిన వాళ్ల నోర్లు ఆటోమేటిగ్గా మూసుకుపోయాయి. ఒకే ఒక్క పోస్టర్‌తో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేక్ చేసి పెట్టేశాడు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ కూడా ఆ పోస్టర్ చూసి “ఇది చిన్న సినిమా కాదు.. భారీ కాన్సెప్ట్‌తో రానుంది.. ఇది డెఫినెట్‌గా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బస్టర్ అవుతుంది” అని చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ ట్రోలింగ్ అంతా ఒకే ఒక్క పోస్టర్‌తో తుడిచిపెట్టేశాడని అభిమానులు గర్వపడుతున్నారు. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కి ఎంత డెడికేషన్‌తో వర్క్ చేస్తున్నాడో ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, ప్రెజెంటేషన్‌నే చూసినా ఈ సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో అర్థమవుతుంది. రివేంజ్ అంటే ఇలాగే ఉండాలి అని చూపించినట్టే జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఒక్క దెబ్బతో అందరి నోర్లు మూయించాడు.