
భారీ అంచనాలతో ఆగస్టు 14న విడుదలైన కూలీ, వార్ 2 సినిమాలు రిలీజ్‌కి ముందే భారీ హైప్‌తో విడుదల అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు భారీ నష్టాలు తప్పలేదు. వార్ 2 బడ్జెట్ సుమారుగా రు. 400 కోట్ల కంటే ఎక్కువ. శాటిలైట్ బిజినెస్ రు. 200 కోట్ల వరకు ఉంటుందని టాక్ ? ఇక కూలీ కూడా రు. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. రిలీజ్ అయ్యాక చూస్తే ఏపీ, తెలంగాణలో కూడా కూలీకే ముందస్తు అడ్వాన్స్ బుకింగ్‌లు బాగా కనిపించాయి. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో కూలీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వార్ 2 ఓపెనింగ్స్‌లోనూ వెనకపడింది. ఫస్ట్ వీక్ చివరికి వార్ 2 రు. 200 కోట్లు వసూళ్లు చేస్తే.. కూలీ రు. 225 కోట్లు రాబట్టింది.
రెండు సినిమాలకు తెలుగులో బడా బడా నిర్మాతలు రంగంలోకి దిగి కొనుగోలు చేయడంతో పాటు ఏరియాల వారీగా కూడా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. అయినా కూడా దమ్మున్న కథా బలం లేకపోవడంతో రెండు సినిమాలు వారం రోజులకే తేలిపోయాయి. రెండు సినిమాలు రిలీజ్ కు ముందు ఎంత హైప్‌తో వచ్చాయో.. రిలీజ్ అయ్యాక అంతే హైప్‌తో బొక్క బోర్లా పడ్డాయి. రెండు సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు తప్పలేదు.
ఈ వాట్సాప్ నెంబర్ కు మీ జిల్లా లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టి కి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు